విజయవాడ గ్రామీణం, 04.08.2026
విజయవాడలో జరిగిన 23వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరాటే ఛాంపియన్షిప్లో చింతలపూడి స్పోర్ట్స్ కరాటే అకాడమీ జేసీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 15 పతకాలు సాధించారు. వీరిలో 5 స్వర్ణ పతకాలు ఉన్నాయి.
విజయవాడలో మంగళవారం నాడు స్పోర్ట్స్ కరాటే డో అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ (SKDAAP) ఆధ్వర్యంలో 23వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరాటే ఛాంపియన్షిప్ మరియు దక్షిణ భారత జోనల్ కరాటే పోటీల ఎంపికలు ఘనంగా జరిగాయి. ఈ పోటీలలో చింతలపూడి స్పోర్ట్స్ కరాటే అకాడమీ జేసీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.
పోటీలలో మొత్తం 15 పతకాలు సాధించిన చింతలపూడి అకాడమీ క్రీడాకారులు, వీటిలో 5 స్వర్ణ పతకాలు, 4 రజత పతకాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. స్వర్ణ పతకాలు సాధించిన వారందరూ దక్షిణ భారత జోనల్ కరాటే పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపికయ్యారు.
సెన్సై పి. సుమన్ రాజు శిక్షణలో ఈ విజయాలు సాధించిన క్రీడాకారులను అకాడమీ ప్రతినిధులు అభినందించారు. వారి కృషి, క్రమశిక్షణ, అంకితభావమే ఈ విజయాలకు కారణమని తెలిపారు. తల్లిదండ్రుల సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జోనల్ పోటీలలో కూడా ఇదే స్ఫూర్తితో రాణించి రాష్ట్రానికి, అకాడమీకి మరిన్ని విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
బంగారు పతకాలు సాధించిన వారిలో జి. జై సూర్య (సబ్ జూనియర్ 7 సంవత్సరాల కతా, సబ్ జూనియర్ 7 సంవత్సరాల బాలుర కుమితే -25 కేజీలు), బి. జశ్వంత్ (క్యాడెట్ బాలుర కుమితే -63 కేజీలు), జి. కార్తికేయ (సబ్ జూనియర్ 11 సంవత్సరాల కతా), టి.అద్విక (సబ్ జూనియర్ 11 సంవత్సరాల కతా) ఉన్నారు. వీరంతా జోనల్ పోటీలకు ఎంపికయ్యారు.
ఇతర విజేతలు: జి. కార్తికేయ (సబ్ జూనియర్ 11 సంవత్సరాల బాలుర కుమితే -55 కేజీలు) రజతం, టి.అద్విక (సబ్ జూనియర్ 11 సంవత్సరాల బాలికల కుమితే -30 కేజీలు) రజతం, బి. డింపుల్ హర్ష (సబ్ జూనియర్ 13 సంవత్సరాల కతా) రజతం, పి. లోక్ష (సబ్ జూనియర్ 7 సంవత్సరాల బాలికల కతా) రజతం. కాంస్య పతకాలు బి. డింపుల్ హర్ష (సబ్ జూనియర్ 13 సంవత్సరాల బాలుర కుమితే -60 కేజీలు), బి. హర్షిత (క్యాడెట్ బాలికల కుమితే -61 కేజీలు), ఎమ్. అన్షు (సబ్ జూనియర్ 11 సంవత్సరాల బాలికల కతా), ఎం.డి. జమాల్ (సబ్ జూనియర్ 12 సంవత్సరాల బాలుర కతా), కె. లెనినా (సబ్ జూనియర్ 11 సంవత్సరాల బాలికల కతా), టి. శ్రీవల్లి (సబ్ జూనియర్ 8 సంవత్సరాల బాలికల కతా) సాధించారు.












