ముంబై (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 04
ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) మంగళవారం తుదిశ్వాస విడిచారు. బ్లడ్ క్లాట్ కారణంగా గుండెపోటుతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం. ఆయన మరణంతో టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రముఖ హిందీ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో విలక్షణ నటుడిగా, శక్తివంతమైన విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు ప్రదీప్ రావత్ (74) మంగళవారం తుదిశ్వాస విడిచారు. బ్లడ్ క్లాట్ కారణంగా గుండెపోటుతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం.
బాలీవుడ్లో 'లగాన్' చిత్రంతో నటుడిగా గుర్తింపు పొందిన ప్రదీప్ రావత్, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'సై' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'ఛత్రపతి' చిత్రంలో ఆయన పోషించిన క్రూర విలన్ పాత్ర తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తన ప్రత్యేక నటన, గంభీరమైన హావభావాలతో విలన్ పాత్రలకు కొత్త గుర్తింపును తీసుకొచ్చారు.
ప్రదీప్ రావత్ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 70కు పైగా చిత్రాల్లో నటించారు. సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో ఆయన అత్యంత బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరిగా నిలిచారు. టాలీవుడ్లో ఆయన చివరిసారిగా 'గాయపడ్డ సింహం' సినిమాలో కనిపించారు.
వ్యక్తిగత జీవితంలో తన ఒక్కగానొక్క కుమారుడిని హీరోగా పరిచయం చేయాలనే ఆశతో ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఆయన మరణించడం కుటుంబ సభ్యులను, అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
ప్రదీప్ రావత్ మరణ వార్తతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.












