జీవితాల్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 02
దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మహానేత చేసిన సేవలను స్మరించుకున్నారు. పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల లో చెరగని ముద్ర వేశాయని ఆయన పేర్కొన్నారు.
_*వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా మహానేతను స్మరించుకున్న...*_ _*ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి*_
_*దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే శ్రీ తూడి మేఘారెడ్డి గారు మహానేత చేసిన సేవలను స్మరించుకున్నారు*_
_*పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు పేర్కొన్నారు.*_
_*రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, 108 అత్యవసర సేవలు, పింఛన్ల విస్తరణ, జలయజ్ఞం వంటి ప్రతిష్టాత్మక పథకాలను ప్రవేశపెట్టి, వాటిని ప్రజలకు చేరువ చేసిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుందని అన్నారు.*_ _*ముఖ్యంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడం, పేద కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించడం, రైతులకు ఉచిత విద్యుత్ అందించడం వంటి నిర్ణయాలు ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపాయని గుర్తు చేశారు.*_
_*అలాగే సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తూ జలయజ్ఞం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత, పేదల గృహ నిర్మాణం వంటి కార్యక్రమాలతో సమగ్ర అభివృద్ధికి వైఎస్సార్ బాటలు వేశారని పేర్కొన్నారు.*_
_*ప్రజల కోసం నిరంతరం ఆలోచించిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సేవలు, సంక్షేమ పాలన నేటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు.*_ _*మహానేత ఆశయాలను స్మరించుకుంటూ ఆయన పవిత్ర స్మృతికి గౌరవపూర్వకంగా నివాళులు అర్పించారు.*_












