ఆర్మూర్, 2 September
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ పాలన వైఫల్యాలను నిరసిస్తూ ఆర్మూర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై ఆర్మూర్‌లో బీఆర్ఎస్ నిరసన
ఆర్మూర్, సెప్టెంబరు 2 (మనోరంజని తెలుగు టైమ్స్): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ పాలన వైఫల్యాలను నిరసిస్తూ ఆర్మూర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు గడుస్తున్నా ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ఎన్నికల హామీలను అమలు చేయడంతో పాటు ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.నిరసన కార్యక్రమంలో దాదన్నగారి విఠల్‌రావు, మాజీ ఎంపీపీ మాసా ప్రభాకర్ (మాక్లూర్), ప్రొఫెసర్ శ్రీనివాస్‌రావు, ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు నరేందర్, మెట్టు సంతోష్, మాజీ మండల అధ్యక్షుడు మాచర్ల సాగర్, మాజీ అధ్యక్షుడు నక్కల బూమేష్ (డోంకేశ్వర్), రాజన్న, సర్పంచ్ బూషన్, రామచంద్రన్పల్లి, మాజీ సర్పంచ్ ఎస్. అశోక్‌రావు (మాక్లూర్), మాజీ మండల అధ్యక్షుడు రంజిత్ (గుంజిలి), మాజీ అధ్యక్షుడు మోహన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేశారు.












