నేడు"మిర్యాలగూడ" (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 02
కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించుకుపోవడాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వ రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మిర్యాలగూడ పట్టణంలో ఈనెల 3వ తేదీ గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు బీఆర్ఎస్ పార్టీ భారీ ధర్నా నిర్వహించనుంది. ఈ ధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
నేడు"మిర్యాలగూడ" లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా.. కేటీఆర్ రాక
👉 మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, సిద్ధార్థ లు ఏర్పాట్ల పరిశీలన :
మిర్యాలగూడ సెప్టెంబర్ 2 (మనోరంజని తెలుగు టైమ్స్)
కృష్ణా జలాలను ఆంధ్ర అక్రమ తరలింపు, కాంగ్రెస్ ప్రభుత్వ రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మిర్యాలగూడ పట్టణంలో ఈనెల 3 (గురువారం) మధ్యాహ్నం 2.30 గంటలకు భారీ ధర్నా నిర్వహిస్తున్నామని బి.ఆర్.ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు.ఈ భారీ ధర్నాకుముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారని తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంపు మైదానంలో ధర్నా.. సభ ఏర్పాట్లను మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు,యువ నాయకులు నల్లమోతు సిద్ధార్థ లు పరిశీలించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని కనివిని ఎరగని రీతిలో నిర్వహించేందుకు పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంపు గ్రౌండ్లో ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ భారీ ధర్నాకు 20వేల మందికి పైగా రైతులు కార్యకర్తలుఅభిమానులు తరలిరానున్నట్లు వారు పేర్కొన్నారు. ధర్నాకు వస్తున్న వారికి ఎటువంటి ఇబ్బందులు కలగాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. క్యాంప్ మైదానంలో ధర్నా నిర్వహించేందుకు స్టేజి నిర్మాణం ప్రజలు కూర్చునేందుకు ఎండ తగలకుండా పెండాల్సు, కుర్చీలు ఏర్పాటు చేయించారు. ధర్నా కార్యక్రమం మధ్యాహ్నం 2:00 గంటలకే ప్రారంభం అవుతుందని బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు మధ్యాహ్నం రెండు గంటల వరకే గ్రౌండ్ కు చేరుకునే విధంగా కృషి చేయాలని కోరారు. వారి వెంట పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.












