పాలన (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 02
తెలంగాణలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయిందని, పార్టీ గ్రాఫ్ పూర్తిగా అడుగంటిపోయిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఇది ప్రజా కాదని, పిచ్చి తుగ్లక్ అని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల అంతా డంబాచారం, గోబెల్స్ ప్రచారమని ఆయన కొట్టిపారేశారు.
-రేవంత్ పాలన అట్టర్ ప్లాఫ్ , అడుగంటిన కాంగ్రెస్ గ్రాఫ్
_ఇది ప్రజాపాలన కాదు పిచ్చి తుగ్లక్ పాలన
_అంతా డంబాచారం .. గోబెల్స్ ప్రచారం
-అప్పులు, తప్పులు చేయడం తప్ప, కాంగ్రెస్ పాలనలో ఏమున్నది గర్వకారణం
-దేవుళ్లపై ఒట్లు, ఆరు గ్యారెంటీలకు తూట్లు, కేసీఆర్ కు తిట్లు
-రెండేళ్ల కాలంలో రేవంత్ నోరు తెరిస్తే అబద్దాలు
-అడుగుదీసి అడుగే స్తే మోసాలు
-కాంగ్రెస్ కు అధికారం తెలంగాణకు మళ్లీ అంధకారం
-ఇందిరమ్మ రాజ్య మంటే మీ ఇష్టారాజ్యమా?
-ఒక్క హామీ అయినా అమలు జరిగిందా?
–రైతు బంధు కు రాం రాం
–దళిత బంధు కు నై భీమ్
–సగం కూడా కాని రుణ మాఫీ, రైతుల బతుకులు ఆగమామం
–24 గంటల కరెంట్ మాయం, మళ్ళీ వ్యవసాయానికి గాయం
–నిరుద్యోగులకు అతీగతి లేని నిరుద్యోగ భృతి
–ఆడపిల్లలకు ఇస్తామన్న స్కూటీలు ఏమయ్యాయి
–పెన్షన్లు పెంచుతామని అవ్వా తాతలకు టోపీ
–కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చారా?
-ప్రజా పాలనంటే పోలీసు రాజ్యమా?రాష్ట్రంలో హిట్లర్ పాలన
-ఇందిరమ్మ రాజ్యమంటేనే హింసాత్మక ప్రభుత్వం
-ఆర్మూరు నుంచి హైదరాబాద్ వరకు అప్రకటిత ఎమర్జెన్సీ
-ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పక్షానికి లేదా?












