బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
బజార్హత్నూర్, సోనాల మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ-2లతో ఇచ్చోడ మండల కేంద్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రత్యేక సమావేశం జరిగింది. మాజీ ఎంపీ సోయం బాపురావు, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్ ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఎస్ఐఆర్ ప్రక్రియపై బజార్హత్నూర్, సోనాల మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ-2లతో ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ సోయం బాపురావు, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్ ముఖ్య అతిథులుగా హాజరై కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని, బూత్ స్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతి బూత్‌లో సమర్థవంతంగా పనిచేస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ-2లకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, బజార్హత్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కళ్లెం విఠల్, సోనాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజుల పోతన్న, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ-2లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.











