నిర్మల్, జూలై 26
వెనుకబడీఎస్న వర్గాల ప్రజల కోసం 1902లో దేశంలోనే తొలీఎస్సారీఎస్గా 50 శాతం రీఎస్జర్వేషన్లు కల్పీఎస్ంచీఎస్న ఛత్రపతీఎస్ సాహు మహారాజ్‌ను యువత స్ఫూర్తీఎస్గా తీసుకోవాలనీఎస్ బహుజన్ సమాజ్ పార్టీ నీఎస్ర్మల్ జీఎస్ల్లా అధ్యక్షుడు అడ్వకేట్ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జగన్ మోహన్ పీఎస్లుపునీఎస్చ్చారు. సామాజీఎస్క న్యాయం, సమాన అవకాశాల సాధనకు రీఎస్జర్వేషన్లు కీలకమనీఎస్ ఆయన ఉద్ఘాటీఎస్ంచారు.
యువత ఛత్రపతి సాహు మహారాజ్‌ను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్ మోహన్ పిలుపునిచ్చారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 124వ రిజర్వేషన్ల దినోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా జగన్ మోహన్ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల ప్రజల కోసం 1902 జూలై 26న దేశంలోనే తొలిసారిగా 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన గొప్ప మహనీయుడు ఛత్రపతి సాహు మహారాజ్ అని అన్నారు. బహుజనులకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఆయన చేసిన చారిత్రక కృషిని కొనియాడారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధనకు రిజర్వేషన్లు ఎంతో అవసరమని, బహుజనుల అభివృద్ధికి అవి బలమైన పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు.
గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు తమవంతు కృషి చేయాలని సూచించారు. ఛత్రపతి సాహు మహారాజ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకుంట రాజేశ్వర్, ఉపాధ్యక్షురాలు లక్ష్మీ యాదవ్, కార్యదర్శి చెరుకు రాజ్యం, సభ్యులు కాటం ప్రభాకర్, చాకటి ఆనంద్, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి జోసెఫ్ గంగారాం, ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జి పవార్ లక్ష్మణ్, నియోజకవర్గ అధ్యక్షుడు వాగ్మారే విలాస్, ప్రధాన కార్యదర్శి చాకటి నిఖిల్, దగ్డే కరణ్, దగ్డే అంబదాస్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











