ముధోల్, జూలై 11
ముధోల్ మండలం రువ్వి గ్రామ సర్పంచ్ నక్క మల్లేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను శనివారం ముధోల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ నారాయణరావు పటేల్ పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ముధోల్ మండలం రువ్వి గ్రామ సర్పంచ్ నక్క మల్లేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను శనివారం ముధోల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ నారాయణరావు పటేల్ పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, ధైర్యంగా ఉండాలని సూచిస్తూ మనోధైర్యం కల్పించారు. నక్క మల్లేష్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ముధోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల గంగారెడ్డి, ఆష్ట సర్పంచ్ రావుల శ్రీనివాస్, గోపిడి ప్రేమ్‌నాథ్ రెడ్డి, రైతు నాయకుడు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ చంద్రయ్య, మాజీ ఎంపీపీ తానూర్ చంద్రకాంత్, పల్లి నాగేష్, మాజీ ఎంపీటీసీ సాయిరెడ్డి, లక్ష్మీనారాయణ, సర్దార్ వినోద్‌కుమార్, భోజేందర్ రెడ్డి, భుజంగరావు, జమీల్ భాయ్, ఎస్.కే. నాజిమ్ తదితరులు పాల్గొన్నారు.











