హైదరాబాద్, జూలై 10
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను రాష్ట్ర మంత్రి కొండా సురేఖ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న విభేదాలపై ఇరువర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే పరిష్కారం చూపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పార్టీ బలోపేతం, అంతర్గత సమన్వయానికి ప్రాధాన్యత ఇస్తూ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.












