బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 09
బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ గురువారం సోనాల మండల కేంద్రంలో కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నమోదు ప్రక్రియ, దరఖాస్తుల స్వీకరణ, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులు, స్థానిక నాయకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటరు నమోదు పత్రాలను పూర్తిగా నింపి సంబంధిత బూత్ స్థాయి అధికారులకు అందజేయాలని కోరారు. ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు సక్రమంగా నమోదు కావాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోపు తమ వివరాలను పరిశీలించి దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక బూత్ స్థాయి అధికారులు లేదా పార్టీ నాయకులను సంప్రదించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సోనాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజుల పోతన్న, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులు లోలపు పోశెట్టి, హరి సింగ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.