ముధోల్, జులై 16
ముధోల్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన కిష్టయ్యకు గురువారం ఘన సన్మానం జరిగింది. మాజీ ఎంపీపీ అఫ్రోజ్ ఖాన్ నేతృత్వంలో పార్టీ నాయకులు కిష్టయ్యను అభినందించి, పార్టీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.
ఇటీవల ముధోల్ మండల అధ్యక్షునిగా ఎన్నికైన కిష్టయ్యను గురువారం మాజీ ఎంపీపీ అఫ్రోజ్ ఖాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. పార్టీ పటిష్టతకు ఎల్లవేళలా కృషి చేసి, అధిష్టానంతో పాటు తమ నాయకుడైన విట్టల్ రెడ్డి మన్నలను పొందాలని వెల్లడించారు.
తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతను ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయడమే తన లక్ష్యమని కిష్టయ్య అన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి కృతజ్ఞులై ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్, స్థానిక సర్పంచ్ ఇజాజోద్దీన్, మాజీ జడ్పీటీసీ సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు విశ్వంబర్, బషీర్, నాయకులు సయ్యద్ ఖలీద్, మహేందర్, విట్టల్ తదితరులు పాల్గొన్నారు.










