ప్రతి ఓటరును ఎస్ఐఆర్ ప్రక్రియలో నమోదు చేయించి, ప్రతి గ్రామంలో 100 శాతం ఓట్లు ఉండేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధ్యతగా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
ప్రతి ఓటరును ఎస్ఐఆర్ ప్రక్రియలో నమోదు చేయించి, ప్రతి గ్రామంలో 100 శాతం ఓట్లు ఉండేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుం బిగించి బాధ్యతగా తమ పనిని నిర్వర్తించాలని మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి పిలుపునిచ్చారు.
గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్ఐఆర్ పై కార్యకర్తలకు, నాయకులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎంత ప్రాముఖ్యమైందో ప్రతి ఓటరుకి తెలియజేయాలనీ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైన రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తమ కృషిలో భాగంగా ఎస్ఐఆర్ లో పాల్గొని తమ ఓటు హక్కును భద్రపరిచేలా ప్రజలను చైతన్యవంతం చేయాలనీ ఆయన కోరారు.
ఇటీవల పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నుకోబడిన వారిని సన్మానించి అభినందనలు తెలిపారు. నూతనంగా ఎన్నుకోబడ్డ మండల అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డికి, పార్టీ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయా మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










