ఖానాపూర్, 2026-07-16
బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిదని, SIR సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత బూత్ ఏజెంట్లదని నిర్మల్ డిసిసి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. కడెం, దస్తూరాబాద్ మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిదని నిర్మల్ డిసిసి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. SIR సర్వే పైన ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత బూత్ ఏజెంట్లదని ఆయన పేర్కొన్నారు.
కడెం, దస్తూరాబాద్ మండలాల బిఎల్ఏ-2 మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటు హక్కు లేకుంటే సమాజంలో విలువ ఉండదని, ఓటు హక్కుతోనే ఎవరినైనా ప్రశ్నించే అర్హత మనకు ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అధికారులకు అందించి, గ్రామాల్లో పూర్తి స్థాయిలో సర్వే పూర్తి చేసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, బూత్ ఏజెంట్లు బాధ్యతతో సర్వే పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. పిడికెడు కార్యకర్తలతో నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన మనం, ఎన్నో కష్టాలు ఎదుర్కొని గెలిచామని, ప్రస్తుత పరిస్థితుల్లో ముందు వచ్చిన, తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరూ మన కుటుంబసభ్యులేనని అన్నారు.
కొత్త పాత తేడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా నిలుస్తానని, ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తెలియజేస్తే పరిష్కరించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తుందని, కొందరికి పనులు కల్పిస్తూ, మరికొందరికి నామినేటెడ్ పదవులలో అవకాశం వచ్చేలా చూస్తానని తెలిపారు.
ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే గారు కడెం, దస్తూరాబాద్ మండలాల లబ్ధిదారులకు 21 లక్షల 52 వేల సీఎం సహాయ నిధి చెక్కులను కాంగ్రెస్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.












