మిర్యాలగూడ, జూలై 1
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే బిఎల్ఆర్ సూచించారు. ఈ మేరకు ఆయన మిర్యాలగూడలోని 126, 137 పోలింగ్ స్టేషన్లు, 4వ వార్డులో ప్రత్యక్షంగా సందర్శించి, నిర్వహణ తీరును పరిశీలించారు. దరఖాస్తుల నమోదు, ఓటరు వివరాల సవరణ, అర్హుల నమోదు ప్రక్రియపై ఆరా తీశారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే బిఎల్ఆర్ సూచించారు. ఈ మేరకు ఆయన ప్రత్యక్షంగా సందర్శించి, నిర్వహణ తీరును పరిశీలించారు.
మిర్యాలగూడలోని 126, 137 పోలింగ్ స్టేషన్లు, 4వ వార్డులో ప్రతి బూత్‌లో నమోదవుతున్న దరఖాస్తులు, ఓటరు వివరాల సవరణ ప్రక్రియ, అర్హులైన ఓటర్ల నమోదు, అవసరమైన ధ్రువపత్రాల పరిశీలన, ప్రజలకు అందుతున్న సేవలపై ఎమ్మెల్యే బిఎల్ఆర్ సమగ్రంగా ఆరా తీశారు. కార్యక్రమం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోపు పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు.
అనంతరం బూత్ లెవల్ అధికారులతో (బిఎల్ఓలు) మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రతి అర్హుడైన ఓటరుకు న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో బిఎల్ఓలు బొందు పార్వతి, ఝాన్సీ రాణి యాదవ్, బిఎల్ఎ ముదిరెడ్డి నర్సిరెడ్డి, రెహమాన్, 4వ వార్డు కమల్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, కౌన్సిలర్ పుట్టపాక శ్రీనివాస్, ఫారుక్, శ్రీజ, నాయకులు చల్ల రాము, అంగన్వాడీ టీచర్లు బొందు పార్వతి, రజిత, ఆర్పిలు చంద్రకళ, ఝాన్సీ, నాగమణిలు పాల్గొన్నారు.












