మిర్యాలగూడ, జూలై 25
మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షుల నియామకానికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మిర్యాలగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గుండు నరేందర్ గౌడ్ (మాజీ సర్పంచ్) ఎన్నికయ్యారు.
మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ వన్ టౌన్, టూ టౌన్, మండలాల పార్టీ అధ్యక్షులను ఖరారు చేస్తూ శనివారం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత తో సంప్రదించిన తదుపరి టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడ వన్ టౌన్ అధ్యక్షులుగా కోడి రెక్క ఇంద్ర కుమార్, బంగారుగడ్డ 32వ వార్డు కౌన్సిలర్ టూ టౌన్ అధ్యక్షులుగా ఎండి హమీదుద్దీన్ (మోయిజ్ ) నియమించారు.
అదేవిధంగా మిర్యాలగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా గుండు నరేందర్ గౌడ్ (మాజీ సర్పంచ్), దామరచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కుర్ర నాగు నాయక్ (మాజీ సర్పంచ్) వేములపల్లి మండల పార్టీ అధ్యక్షులుగా ఆర్ రవీందర్ రెడ్డి లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఎన్నికైన అధ్యక్షులు కృషి చేయాలని కోరారు.
ఎన్నికైన పట్టణ, మండల పార్టీ అధ్యక్షులను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్ ) అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.












