Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడీ శ్రీహరి రావు శుక్రవారం నిర్మల్ పట్టణంలో కొనసాగుతున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఈ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని ఆయన సూచించారు.
నిర్మల్ పట్టణంలో కొనసాగుతున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడీ శ్రీహరి రావు శుక్రవారం పరిశీలించారు. ఆశ్రా కాలనీ, ఇంద్రానగర్, ద్యాగవాడ, ప్రియదర్శిని నగర్ తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించి, బూత్ స్థాయి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఓటరు నమోదు కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడి, నమోదు ప్రక్రియపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కోరారు.
అలాగే ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి దరఖాస్తును ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల మేరకు తప్పనిసరిగా అంతర్జాల విధానంలో నమోదు చేయాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులో నమోదు చేయాలని అన్నారు. చిన్నపాటి పొరపాటు వల్ల కూడా అర్హులైన ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తలెత్తకుండా అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎర్రవోతు రాజేందర్, వెంగ్వపేట రమేష్, కొట్టే శేఖర్, నాంపల్లి కిరణ్, పరిమండల్ అన్వార్, పుడారి శివ, ప్రశాంత్, గాయిదపల్లి సంతోష్, సర్పంచ్ వసంత్, దిల్వార్పూర్ రవి తదితరులు పాల్గొన్నారు.












