బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
మంత్రి కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా బోథ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
మండల కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు మాజీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బోథ్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో బీఆర్ఎస్ నాయకులు రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు స్వామి, మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, బోథ్ పట్టణ అధ్యక్షులు అల్లకొండ ప్రశాంత్, విడిసి చైర్మన్ అల్లకొండ పోతన్న, సర్పంచులు రూప్‌చంద్, రాజేందర్, రవి, రవీందర్, సంజీవ్, రాజు రెడ్డి, బాబులల్, రామకిష్టు, సీనియర్ నాయకులు రమణ రెడ్డి, బాపురెడ్డి, గంగమల్లు, నరేందర్ రెడ్డి, ఆటో మల్లేష్, ప్రకాష్ రెడ్డి, సందీప్, సురేష్, గులాబ్ సింగ్, గంగారెడ్డి, అందుర్ ఉప సర్పంచ్ మామిడి సంతోష్, గబ్బర్ సింగ్, ధీరజ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.












