మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
నీట్ పేపర్ లీకేజీతో విద్యార్థుల జీవితాలు దెబ్బతిన్నాయని, నిరసనకారులకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ జిల్లా చైర్మన్జిల్లాచైర్మన్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ ప్రభుత్వ చేతకానితనం వల్లే ఈ అరెస్టులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
నీట్ పేపర్ లీకేజీతో దేశవ్యాప్తంగా విద్యార్థుల జీవితాలు దెబ్బతిన్నాయని, ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా నిలిచిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ముఖ్య నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం, వారికి మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం బీజేపీ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
నీట్ పేపర్ లీకేజీ కారణంగా మరణించిన విద్యార్థులకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులకు అండగా నిలవాలని ఆయన కోరారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల వల్లే అన్ని పరీక్షలు లీకేజీలకు గురవుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో యువత బీజేపీకి బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. విద్యార్థులకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే విద్యార్థులకు న్యాయం చేస్తుందని, వారి భవిష్యత్తుకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.












