Nirmal/Kadam (Peddur) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు, రేపు (24.07.2026) శుక్రవారం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే.టి. రామారావు (కేటీఆర్) జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, దస్తురాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటలకు కేక్ కటింగ్, అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ జరగనుంది.
బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు, రేపు (24.07.2026) శుక్రవారం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే.టి. రామారావు (కేటీఆర్) జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, బీఆర్ఎస్ పార్టీ దస్తురాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రేపు ఉదయం 9:30 గంటలకు కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుందని, అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉపసర్పంచులు, మండల వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, వార్డ్ సభ్యులు, పత్రిక మీడియా మిత్రులు పాల్గొని విజయవంతం చేయాలని మనవి చేశారు.
ఈ కార్యక్రమాలకు బిఆర్ఎస్ పార్టీ దస్తురాబాద్ మండల అధ్యక్షులు ముడికే ఐలయ్యయాదవ్, బిఆర్ఎస్ పార్టీ దస్తురాబాద్ మండల ప్రధాన కార్యదర్శి అరుగుల రాజనర్సయ్య నాయకత్వం వహిస్తారు.












