మంత్రాలయం, జూలై 24
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని, ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు ఖానాపూర్ మండల, పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని, ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు ఖానాపూర్ మండల, పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఖానాపూర్ పట్టణంలోని శ్రీ వీరాంజనేయ శివ సాయి సమాజ్ (జంగల్ హనుమాన్ ఆలయం)లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
ప్రజా పోరాటాలనే తన జన్మదిన వేడుకలుగా భావించే కేటీఆర్, తన పుట్టినరోజును సైతం ప్రజల సంక్షేమానికి అంకితం చేశారని నాయకులు కొనియాడారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నీట్ (NEET) విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని, మరోసారి ప్రజల పక్షాన తన అంకితభావాన్ని కేటీఆర్ చాటిచెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సోయఫ్ హుస్సేన్, బాదం కుర్తి మాజీ ఎంపిటిసి శ్రావణ్ కుమార్, రామ్ నాయక్, కొక్కుల ప్రదీప్, మున్సిపల్ కౌన్సిలర్ రాజా గంగన్న, తుడుశ ఇంద్ర, బీసీ రాజన్న, వాల్ సింగ్, ఖానాపూర్ మండల, పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












