కామారెడ్డి, జూలై 5
కామారెడ్డి జిల్లా గాందారి మండల కేంద్రంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ సర్పంచ్ సత్యం కుమారుడి వివాహ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాందారి మండల కేంద్రంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ సర్పంచ్ సత్యం కుమారుడి వివాహ వేడుక ఆదివారం హారేలి గార్డెన్లో ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందమయంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జి.జి. గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు నల్లమడుగు సురేందర్, హన్మంత్ షిండే, జనార్ధన్ గౌడ్, నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ పోతంగల్ కిషన్‌రావు, మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ తానాజీరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సర్వపు సత్యనారాయణరావు, ముకుంద్‌రావు, శివాజీరావు, ఎ. గంగాగౌడ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.










