ఖానాపూర్, జూలై 21
ఖానాపూర్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం పూర్తి స్థాయి కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఖానాపూర్ మండలం దిలావర్పూర్ గ్రామానికి చెందిన రాసమల్ల అశోక్ ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
డిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాసమల్ల అశోక్ ను నియమించినట్లు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు, నిర్మల్ జిల్లా అధ్యక్షులు కట్ట శ్యామ్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా పూర్తి స్థాయి కమిటీని నియమించారు.
ఈ కమిటీలో ఖానాపూర్ మండలం లోని దిలావర్పూర్ గ్రామానికి చెందిన రాసమల్ల అశోక్ ను నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందన్నారు. గతంలో అశోక్ యూత్ కాంగ్రెస్ లో సోషల్ మీడియా విభాగంలో పార్టీ పదవులను నిర్వహించారు. ఆయన నియామకం పట్ల దిలావర్పూర్, ఖానాపూర్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.












