బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
జిల్లాలో ఎస్ఐఆర్ (సర్వీస్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్) ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాల్సిన బాధ్యత బిజెపి నాయకులు, కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జిల్లాలో ఎస్ఐఆర్ (సర్వీస్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్) ప్రక్రియను పకడ్బందీగా జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత బిజెపి నాయకులు, కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
బోగస్ ఓట్లను తొలగించేందుకే ఎన్నికల కమిషన్ సర్ ప్రక్రియ చేపట్టిందని, ప్రతి ఒక్కరూ ఎస్.ఐ.ఆర్. లో తమ ఓటు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. గడువులోగా బిజెపి పార్టీ బిఎల్ఎలు మరింత కృషి చేసి ఎస్.ఐ.ఆర్. ప్రక్రియను విజయవంతం చేసేందుకు పాటుపడాలని కోరారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి సంఘటన మంత్రి ప్రధాన చంద్రశేఖర్ జీ, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావ్ లను ఎమ్మెల్యేతో పాటు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు రితిష్ రాథోడ్ లు స్వాగతించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.












