కీసర, జనవరి 13
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కింద జరుగుతున్న ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల గడువును మరో నెల రోజుల పాటు పొడిగించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు జన్నారం రాంపల్లి దాయరా వద్ద సోమవారం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఓటర్లలో గందరగోళం సృష్టిస్తున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించాలని పార్టీ నాయకులు కోరారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కింద జరుగుతున్న ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల గడువును మరో నెల రోజుల పాటు పొడిగించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు జన్నారం రాంపల్లి దాయరా వద్ద సోమవారం పార్టీ ఆధ్వర్యంలో ప్లేకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఎం కీసర మండల కన్వీనర్ బంగారు నర్సింగరావు మాట్లాడుతూ, ఎస్ఐఆర్ పేరుతో ఓటర్లలో గందరగోళం సృష్టిస్తున్న పరిస్థితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రతి ఇంటికి బీఎల్వోలు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి, ఓటరు నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మ్యాపింగ్ పేరుతో ఓటర్లను అక్రమంగా జాబితా నుంచి తొలగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ప్రతి అర్హుడి ఓటు హక్కును పరిరక్షించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్యూమరేషన్ ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు చింతకింది అశోక్, కలువల శ్రీనివాస్, సిల్వవేర్ సుదర్శన్, ఈగురపు సత్తయ్య, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.












