మిర్యాలగూడ, జూలై 28
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేస్తోందని బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మిర్యాలగూడ మండలం అవంతిపురంలో ఎస్ఐఆర్ నమోదును పరిశీలించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి విమర్శించారు. మిర్యాలగూడ మండలం అవంతిపురంలో ఎస్ఐఆర్ నమోదును పరిశీలించిన అనంతరం ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
6 గ్యారంటీలలో భాగంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి సుమారు రూ.10,000 కోట్లను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రైతులకు రుణమాఫీ మిగిలిన బకాయి సుమారు రూ.31,000 కోట్లను వెంటనే మాఫీ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ సుమారు 4000 కోట్లను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం రైతులను 8 సన్న వరి రకాలను మాత్రమే పండించాలనే నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికను రూపొందించాలని సూచించారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసల్ బీమా యోజనను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు రేపాల పురుషోత్తంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పులి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.












