కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలి :చలిమల్ల వెంకటరత్నం
మిర్యాలగూడ ఆగస్టు 1 (మనోరంజని తెలుగు టైమ్స్)
గ్రామీణ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఎస్సీ సెల్ నల్గొండ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చలిమల్ల వెంకటరత్నం అన్నారు. మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామానికి చెందిన చలిమల్ల వెంకటరత్నం ను జిల్లా ఉపాధ్యక్షులుగా నియమిస్తూ నల్గొండ డిస్టిక్ కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ ఛైర్మెన్ బోడస్వామీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ నియామక పత్రాన్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) చేతుల మీదుగా వెంకటరత్నం శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందుకున్నారు. ఈ సందర్భంగా వెంకటరత్నం మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాలలో ఎస్సీ విభాగం కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచేందుకు తన వంతు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియపరుస్తానని, నిరంతరం అందుబాటులో ఉండి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మిర్యాలగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండు నరేదర్ అవంతిపురం సర్పంచ్ సర్పంచి వల్దాస్ సుజాత సురేష్ రాయిని పాలెం సర్పంచి మురళి, ముల్కల కాలువ సర్పంచ్ జోష గౌడ్, గ్రామ కమిటీ దాసరి కుమార్, చలిమళ్ళ లక్ష్మి, హరిబాబు, బంగారి, మహేష్, కోటేశ్, యడవల్లి అంజియా, అజయ్, శ్రీను, సైదులు, పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులు పాల్గొనారు.












