బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
నెరడిగొండ మండలంలోని కుంటాల బి గ్రామ సర్పంచ్ గంగారాం, గ్రామస్తులు శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తమ గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరించే ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తోనే కొనసాగుతామని, ఇతర పార్టీలో చేరడం తప్పయిందని వారు పేర్కొన్నారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
నెరడిగొండ మండలంలోని కుంటాల బి గ్రామ సర్పంచ్ గంగారాం, గ్రామస్తులు శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఇతర పార్టీలో చేరి తప్పు చేశానని, తమ గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరించే ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తోనే కొనసాగుతామని గ్రామ పెద్దలతో కలిసి ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నానని, మీ మండల వాసిగా, మీ బిడ్డగా ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటానని, ఎలాంటి సమస్య వచ్చినా మీతో నిలబడతానని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












