హైదరాబాద్, జూన్ 30
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పూర్తిస్థాయి డిజిటల్ ఈ-కేబినెట్ సమావేశం జూలై 2 మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. హైదరాబాద్లోని సచివాలయంలో జరిగే ఈ సమావేశం కోసం అన్ని శాఖలు అజెండా రూపకల్పనపై కసరత్తు చేస్తున్నాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా పూర్తిస్థాయి డిజిటల్ ఈ-కేబినెట్ సమావేశం జూలై 2 మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం 6వ అంతస్తులో గల కేబినెట్ సమావేశ మందిరంలో ఈ 34వ మంత్రిమండలి సమావేశం జరగనుంది.
కేబినెట్ భేటీ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు అజెండా రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేశాయి. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ శాఖల కార్యదర్శులు తమ తమ శాఖలకు సంబంధించిన అజెండా అంశాలను సర్క్యులేషన్ ద్వారా ఆమోదించి, వాటిని తెలుగు అనువాదంతో సహా సాధారణ పరిపాలన కేబినెట్ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించకుండా ఏకపక్షంగా తెచ్చిన కొత్త నిబంధనలు సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉండటంతో పాటు, తెలంగాణ గ్రామీణ కూలీలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఈ అన్యాయాన్ని ఎదిరించేందుకు కేంద్ర నిర్ణయం వల్ల నష్టపోతున్న ఇతర రాష్ట్రాలన్నింటిని కలుపుకొని సుప్రీంకోర్టులో ఉమ్మడిగా న్యాయపోరాటం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది.
మంత్రిమండలి సమావేశం జరిగే సమయంలో ఎలాంటి పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కేబినెట్ సమావేశం ముగిసే వరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులందరూ ఖచ్చితంగా తమ ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని సీఎస్ కె. రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.












