Nirmal/Lokeshwaram (మనోరంజని తెలుగు టైమ్స్) జూన్ 30
లోకేశ్వరం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మంగళవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించిన ఆయన, విద్యార్థులతో మమేకమై ఉపాధ్యాయుడిగా మారి స్వయంగా పాఠాలు బోధించారు. విద్యార్థుల అభ్యాస సామర్థ్యం, బోధన తీరును తెలుసుకున్నారు.
లోకేశ్వరం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మంగళవారం ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించిన ఆయన, విద్యార్థులతో మమేకమై ఉపాధ్యాయుడిగా మారి స్వయంగా పాఠాలు బోధించారు. విద్యార్థుల అభ్యాస సామర్థ్యం, బోధన తీరు గురించి తెలుసుకుని, మరింత నాణ్యమైన విద్య అందించేలా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
అనంతరం పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, వసతి గృహాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ విద్యార్థులతో సూర్యనమస్కారాలు, యోగాభ్యాసం చేయించాలని సూచిస్తూ, దీంతో విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు.
ఈ తనిఖీలో డి ఇ ఒ భోజన్న, ఎంఈఓ చంద్రకాంత్, ఎంపీఓ సల్మాన్ రాజ్, ప్రిన్సిపాల్ అనసూయ, సర్పంచ్ ధార్వాడే కపిల్, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్, ఉపసర్పంచ్, నాయకులు రామచందర్ రావు, పనిల్రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటనతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమై, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు సూచించారు.











