నవీపేట్, జూలై 8
నవీపేట్ మండలంలోని రాంపూర్ గ్రామంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాదన్నగారి విఠల్‌రావు, బూత్ కమిటీలను బలోపేతం చేయాలని, ఓటరు జాబితాలో అవసరమైన సవరణలు చేయాలని సూచించారు.
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని రాంపూర్ గ్రామంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ఓటర్లను చైతన్యపరిచి, సేకరించిన ఓటరు ఫారాలను గ్రామం తరఫున బీఎల్వోకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ జడ్పీ చైర్మన్, బోధన్ నియోజకవర్గ ఇంచార్జి దాదన్నగారి విఠల్‌రావు మాట్లాడుతూ, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల ప్రకారం బూత్ కమిటీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఓటరు జాబితాలో మృతి చెందిన వారి పేర్లను తొలగించి, అర్హులైన కొత్త ఓటర్ల పేర్లను నమోదు చేయాలని కోరారు. ప్రతి ఓటరు తన వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బి. నరసింగ్‌రావు, బి. శ్రీనివాస్‌రావు, అల్లం రమేష్, గంగాధర్, మోహన్ (మాజీ ఎంపీటీసీ), అశోక్, లావణ్య, రాజేశ్వర్, నవీపేట్ సహకార పరపతి సంఘం చైర్మన్ అబ్బన్న, గ్రామస్తులు పాల్గొన్నారు. బీఎల్వో సువర్ణ, తహసీల్దార్ వెంకటరమణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.












