పార్లమెంట్ సమావేశాలలో బీసీ బిల్లునుఆమోదించాలి :
మిర్యాలగూడ జూలై 24 (మనోరంజని తెలుగు టైమ్స్)
పార్లమెంట్ సమావేశాలలో బీసీ బిల్లును ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బోయపల్లి రవీందర్ గౌడ్ కోరారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ఆయన మాట్లాడుతూ బీసీ జనాభా తమాషా ప్రకారం రాజకీయ , ఉద్యోగ, ఇతర రంగాలలో రిజర్వేషన్లు వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల పార్లమెంట్ సభ్యులు ఉభయ సభలలో తమ గొంతు వినిపించి బిసిరిజర్వేషన్ బిల్లును ఆమోదించే విధంగా కృషి చేయాలని కోరారు. వివిధ రకాల కారణాలు చూపుతూ బీసీ బిల్లు ఇదే విధంగా పెండింగ్ లో ఉంచినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.బీసీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరూ ఐక్యంగా కలిసి ఆయా పార్టీలకు తగిన విధంగా సమాధానం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త డాక్టర్ రాజు, బీసీ జేఏసీ దాసరాజు జయరాజు, బీసీ జేఏసీ చేగొండిమురళి యాదవ్, ఇతర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.












