బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే. తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని సోనాల మండలంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. వ్యవసాయ క్షేత్రంలో రైతులే స్వయంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
సోనాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే. తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం రైతులు వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. వ్యవసాయ క్షేత్రంలో రైతులే స్వయంగా కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం బీఆర్ఎస్ మండల నాయకులు రైతులతో కలిసి సంబరాల్లో పాల్గొని స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కేటీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొని ఉత్సాహంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు.












