బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 13
బోథ్ నియోజకవర్గ పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రజలకు పూర్తి సహకారం అందించాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రజలకు పూర్తి సహకారం అందించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.
ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని పేర్కొన్న ఆయన, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాలు, వార్డులు, బస్తీల్లో ప్రజలకు అవగాహన కల్పించి, దరఖాస్తుల నింపడంలో సహాయం చేయాలని కోరారు.
కొత్త ఓటర్ల నమోదు, పేరు సవరణ, చిరునామా మార్పు తదితర దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయించేలా పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, దూర ప్రాంతాల ప్రజలకు అవసరమైన సహాయం అందించి ఒక్క అర్హుడూ ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.












