కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యంకు యూత్ కాంగ్రెస్ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. యువత, ప్రజా సంక్షేమం కోసం మేడిపల్లి సత్యం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
అంతేకాకుండా, ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఏనుగుల ప్రశాంత్ కుమార్, బోయినిపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కళ్లేపల్లి సతీష్, గోల్కొండ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.












