బీజేపీకి అసలైన బలం నిబద్దత గల కార్యకర్తలేనని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు.
ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, శుక్రవారం నిర్మల్ పట్టణంలోని బాలాజీ ఇన్ లో జరిగిన దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమ ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, ఆయన బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చి, పార్టీ స్థాపన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సిద్ధాంతాలను వివరించారు. ఆయన, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి రానుందని పేర్కొన్నారు.
పార్టీ కార్యకర్తలు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయి నుండి నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ గోపిడి స్రవంతి రెడ్డి, భైంసా మున్సిపాలిటీ చైర్మన్ తుమ్మోళ్ల దాత్తత్రి పటేల్, ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ తదితరులు పాల్గొన్నారు.












