నిర్మల్, జూన్ 27
తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటొల్ల వెంకటస్వామి పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ నెల 29న హైదరాబాద్లోని ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి దళిత గిరిజన జర్నలిస్టులు, సామాజిక వాదులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.
తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటొల్ల వెంకటస్వామి పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు వివిధ మండలాల నుండి ఈనెల 29న హైదరాబాద్లోని ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి దళిత గిరిజన జర్నలిస్టులతో పాటు సామాజిక వాదులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
రాష్ట్రంలో అక్రిడిటేషన్ల విషయంలో దళిత గిరిజన జర్నలిస్టులపై సామాజిక, కుల వివక్ష చూపుతూ కార్డుల పంపిణీలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్రిడిటేషన్ కమిటీలలో ఇతర సామాజిక వర్గాల ఆధిపత్యం కొనసాగిస్తూ దళిత గిరిజన జర్నలిస్టులను పక్కన పెట్టే విధానాన్ని తక్షణమే విరమించుకోవాలని, అర్హులైన ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.












