మిర్యాలగూడ, జూలై 22
నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాలో పోలీసులు అతి దారుణంగా విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని మిర్యాలగూడ బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆయన విమర్శించారు.
నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాలో పోలీసులు అతి దారుణంగా విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని మిర్యాలగూడ బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ తీవ్రంగా ఖండించారు.
బుధవారం ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి చదువుకొని బంగారు భవిష్యత్తు కోసం పరీక్షలు రాస్తుంటే పేపర్ లీకేజీలు జరుగుతుంటే అడ్డుకోవాల్సిన ప్రభుత్వం, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని విమర్శించారు.
పేపర్ లీకేజీల కారణంగా సుమారు 12 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం ఏ మాత్రం చలనం లేకుండా ఉండడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రసాద్ తక్షణమే రాజీనామా చేయాలని, ఎంతో కాలంగా ఉద్యమాలు కొనసాగిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా నేటికి మనుగడలో లేవన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థుల జోలికొస్తే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు అంతా కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం నల్గొండ జిల్లా కన్వీనర్ సిద్ధం రాజు, బీసీ యువజన సంఘం నియోజకవర్గ నాయకులు మునగాల శైలేందర్, బీసీయువజన సంఘం పట్టణ కన్వీనర్ పట్టేటి రమేష్, బీసీ యువజన సంఘం పట్టణ నాయకులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.












