ఖానాపూర్, జూలై 22
ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న విషయాలను తరగతి గదిలో బోధించాలని మండల విద్యాధికారి (ఎంఈఓ) సంధ్యారాణి అన్నారు. ఖానాపూర్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన ఎఫ్.ఎల్.ఎన్. (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.

రాష్ట్ర విద్యాశాఖ అమలు చేస్తున్న ఎఫ్.ఎల్.ఎన్. కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు తరగతి గదిలో సక్రమంగా అమలు చేయాలని ఆమె సూచించారు. గత నాలుగు సంవత్సరాలుగా విద్యారంగంలో వివిధ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. శిక్షణలో రిసోర్స్ పర్సన్లు చెప్పిన అంశాలను విద్యాబోధనలో విద్యార్థులకు బోధించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ సంధ్యారాణితో పాటు రిసోర్స్ పర్సన్లు డి. నరసయ్య, వాజిద్, సి. సుజాత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.