రుతుపవనాలు రాబోతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో, ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి కొనుగోలు ప్రక్రియతో పాటు, జూన్ 9న జరిగే మండల మహిళా సమాఖ్య సభ్యులకు ఆర్టీసీ బస్సుల పంపిణీ కార్యక్రమం మరియు నీట్ పరీక్ష నిర్వహణపై చర్చ జరిగింది.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఈ విధానంలో కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని తెలిపారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించడం జరుగుతున్నది.
జూన్ 9న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వివరించారు.











