మిర్యాలగూడ పట్టణంలోని 6వ వార్డ్ ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బిఎల్ఆర్ పేద మహిళలకు చీరలను అందించారు.
ఈ కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అన్ని వేళలా తోడుగా ఉంటుందని తెలిపారు.
మహిళల సంక్షేమమే తమ మొదటిప్రాధాన్యత అని ఆయన అన్నారు. ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతులపై ఆయన వ్యాఖ్యానించారు.












