హైదరాబాద్, 2026-06-05
తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర సేవల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని రకాల ఎమర్జెన్సీల కోసం ఒకే నంబర్‌గా 112ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర సేవల నంబర్లలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై రాష్ట్రంలో అన్ని రకాల ఎమర్జెన్సీ సేవల కోసం ఒకే నంబర్‌గా 112ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా డయిల్ 112 సేవలను అధికారికంగా ప్రారంభించారు.
సేవల ఏకీకరణ
ఇప్పటివరకు అమల్లో ఉన్న వేర్వేరు అత్యవసర నంబర్లకు బదులుగా ఇకపై ఈ సింగిల్ ఎమర్జెన్సీ నంబర్ పనిచేయనుంది. దీనివల్ల ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో సేవలు పొందడం సులభతరం అవుతుందని అధికారులు తెలిపారు.












