ఖానాపూర్, ఆగస్టు 3
ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ కాలనీ 9వ వార్డులో ఎస్ఐఆర్ () సర్వే కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా వార్డు సభలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్, సర్వేలో కీలక పాత్ర పోషించిన బిఎల్ఓలు, బిఎల్ఏలను సన్మానించారు. సర్వేలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించిన వారికి ఈ గౌరవం దక్కింది.
ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ కాలనీ 9వ వార్డులో ఈ రోజు నిర్వహించిన ఎస్ఐఆర్ () సర్వే వార్డు సభ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాలనీలో ఎస్ఐఆర్ సర్వే చివరి దశ సందర్భంగా బిఎల్ఏలు, బిఎల్ఓలు కాలనీ వాసులతో కలిసి వార్డు సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. మరణించిన వారి మరియు అందుబాటులో లేని వారి వివరాలను సేకరించి సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేశామని అన్నారు. అనంతరం, సర్వే కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించిన బిఎల్ఓలు, బిఎల్ఏలకు సన్మాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.












