రాజన్న సిరిసిల్ల, జులై 27
బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్‌ఏగా విధులు నిర్వహిస్తున్న గుండేటి చంద్రమౌళి, సుమారు 2 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వస్తున్న విద్యార్థిని గుంట అనుశ్రీకి తన సొంత ఖర్చుతో సైకిల్ కొనిచ్చి ఉదారత చాటుకున్నారు. ఈ చర్యకు పలువురు అభినందనలు తెలిపారు.
విద్యార్థినిపై ఉదారత చాటుకున్న ఉపాధ్యాయుడు గుండేటి చంద్రమౌళిని పలువురు అభినందించారు. బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్‌ఏగా విధులు నిర్వహిస్తున్న గుండేటి చంద్రమౌళి, పక్క గ్రామమైన గుండన్నపల్లి నుంచి రోజూ సుమారు 2 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వస్తున్న విద్యార్థిని గుంట అనుశ్రీకి సొంత ఖర్చుతో సైకిల్ కొనిచ్చారు.
ఈ సందర్భంగా స్తంభంపల్లి గ్రామ సర్పంచ్ బొంగాని అశోక్‌గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు వారి స్థితిగతులు, బాగోగుల గురించి ఆలోచించడం అభినందనీయమన్నారు. పాఠశాలకు సంబంధించిన ఏ అవసరం ఉన్నా తాను, తన పాలకవర్గం అందుబాటులో ఉంటామని తెలిపారు. విద్యార్థులు, గ్రామ ప్రజల తరఫున ఉపాధ్యాయుడు చంద్రమౌళికి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులు చంద్రగిరి వెంకటేష్, గంగాధర గంగాజమున, చిలుముల శ్రీమణి, కొట్టపల్లి రమ్యశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.












