మిర్యాలగూడ, జూలై 12
మిర్యాలగూడ మండలంలోని మాలోతు తండాలో ఆదివారం బంజారాల శీతల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు శీతల దేవతలకు నైవేద్యాలు సమర్పించి, వర్షాలు, పంటలు, పశుసంపద సమృద్ధిగా ఉండాలని ప్రార్థించారు.
మిర్యాలగూడ మండలంలోని జంకు తండ గ్రామపంచాయతీ పరిధిలోని మాలోతు తండాలో ఆదివారం బంజారాల శీతల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు గిరిజనుల ఏడు దేవతలైన శీతల దేవతలకు నైవేద్యం సమర్పించారు. బోనాలు ఎత్తుకొని వివిధ రకాల తో చేసిన నైవేద్యాలను శీతల దేవతలకు సమర్పించారు.
వర్షాలు సమృద్ధిగా పడాలని, పంటలు బాగా పండాలని, పశుపక్షాదులు సమృద్ధిగా ఉండాలని వారు కోరుకున్నారు. గిరిజన మహిళల ఆటపాటలు, గిరిజన వేషాధారణలో పలువురు ఆకట్టుకున్నారు.
కార్యక్రమంలో దేవత పూజారి జామలానాయక్, శ్రీరాములు, మహిళలు మాలోతు రజిని, సరోజ, హీర, మారోని, పిక్కి, జానీ తదితరులు పాల్గొన్నారు.











