మునిపెల్లి (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 12
లక్ష్మణచంద మండలంలోని మునిపెల్లి గ్రామంలో వన దేవత పండగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామాభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విడిది సభ్యులు వనదేవతకు ప్రత్యేక పూజలు చేసి, వర్షాలు, పాడిపంటలు వృద్ధి చెందాలని ప్రార్థించారు. అనంతరం మేకను బలి ఇచ్చి సామూహిక వనబోజనాలు చేశారు.
లక్ష్మణచంద మండలంలోని మునిపెల్లి గ్రామంలో వన దేవత పండగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామాభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విడిది సభ్యులు వనదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలు వర్థిల్లాలని వారు ఆకాంక్షించారు.
అనంతరం మేకను బలి ఇచ్చి, సామూహిక వనబోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మేడిపెల్లి సునీత, ఉప సర్పంచ్ నూతికాడి రంజిత్ రెడ్డి, మాజీ సర్పంచ్ మేడిపెల్లి గంగాధర్, గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు గురాల లింగారెడ్డి, గోలి గంగాధర్, అబ్బడి ముత్యం రెడ్డి, దొడ నర్సారెడ్డి, జుంజురు భూమేష్, ముక్కెర శంకర్, బొడ్డు లింగన్న, దాస రాజు, ముక్కెర నారాయణ, గొర్రె గంగన్న, పోచంపల్లి శంకర్, నల్ల ప్రభాకర్ రెడ్డి, పార్ పెల్లి గంగారెడ్డి, శనిగారపు లచ్చన్న, పల్లికొండ దశరథ్, దూదేకుల చిన్న మమ్మద్, గ్రామస్తులు పాల్గొన్నారు.












