సోనాల మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేయడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజుల పోతున్న మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సోనాల మండలం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడంతో ఈ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని అన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యుడు సోయం బాబురావు, డిసిసి అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, బోథ్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆడే గజేందర్, ఇంటలెక్చువల్ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి లోలపు పోశెట్టి, చౌహన్ హరి సింగ్, ఎస్సీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి భీంరావు పాటిల్, బోథ్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు గుడాల అనిష్, సోనాల సర్పంచుల సంఘం అధ్యక్షుడు చౌహాన్ వినోద్ సింగ్, చింతల్ బోరి సర్పంచ్ గైక్వాడ్ శ్రీరామ్, బోథ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మునేశ్వర్ సోమన్న, జుంగల భోజన్న, వార్డ్ సభ్యులు చెట్లపెళ్లి అశోక్, మాజీ సర్పంచులు సోయం బాపూరావు, రాందాస్, మాజీ ఉపసర్పంచ్ గంగారెడ్డి, సీనియర్ నాయకులు బాశెట్టి సుదర్శన్, అమృత్ రావ్ పాటిల్, చెట్లపెళ్లి సుధీర్, బాలాజీ, హేమన్ రావు తదితరులు పాల్గొన్నారు.











