Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో ఉన్న ఆశ్రమ పాఠశాలను ఎంపీఓ అజీజ్ ఖాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని హాస్టల్ సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న వసతుల వివరాలను ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు.

వసతి గృహంలో పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా వర్షాకాలం దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచించారు.
విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎంపీఓ అజీజ్ ఖాన్ తెలిపారు. ఈ తనిఖీలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.