కరీంనగర్, 2026-06-05
ఎవరో విలువ ఇవ్వలేదని బాధపడకూడదని, మనకు విలువ ఇవ్వమని అడిగే ముందు మనమే విలువ పెంచుకోవాలని ఫ్రీలాన్స్ రచయిత, తెలంగాణ ఎకనామిక్ ఫోరం రాష్ర్ట అధ్యక్షులు నేదునూరి కనకయ్య అన్నారు. మన విలువలకు మనమే కర్త కర్మ క్రియ అని ఆయన పేర్కొన్నారు.
ఎవరో విలువ ఇవ్వలేదని బాధపడకూడదు. మనకు విలువ ఇవ్వమని అడిగే ముందు మనమే విలువ పెంచుకోవాలి. మన విలువలకు మనమే కర్త కర్మ క్రియ. మనం విలువలు పాటిస్తే, అవే విలువలు మనకు గుర్తింపు తెస్తాయి.
మన నైపుణ్యాలు, మన వ్యక్తిత్వం, మన ఆలోచన విధానం, మన నడవడి, మన చర్యల కలబోతే మన విలువ. ఇతరుల పట్ల గౌరవం, ఆదరణ మన ఉనికిని చాటుతాయి.
మన ముందు మంచి అని పొగిడేవారు, మన వెనుక కూడా మన పట్ల మంచినే చెప్పాలి. మంచిని పెంచి, మంచిని పంచే మానవతావాదులుగా నిలవాలి.
సక్రమ జీవనశైలి, పరోపకారం, సహనశీలత, ఆలోచనలకు ఆచరణకు మధ్య సమతూకం మనస్తత్వం విశ్వసనీయతకు ఆలంభణ అవుతుంది.
సకారాత్మక కార్యాచరణతో జీవిస్తే సమాజంలో మీ వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.
కష్టాలను ఇష్టాలుగా మార్చుకొని ముందడుగు వేస్తే సమాజానికి స్ఫూర్తి వైతాళికులుగా నిలుస్తారు. పట్టుదలే పెట్టుబడిగా సంకల్పిస్తే ప్రగతి వెలుగులకు దీప్తి వైతాళికులుగా ఉంటారు.
ఫ్రీలాన్స్ రచయిత, తెలంగాణ ఎకనామిక్ ఫోరం రాష్ర్ట అధ్యక్షులు నేదునూరి కనకయ్య ఈ విషయాలను తెలిపారు. ఆయన కరీంనగర్ నివాసి. ఆయన ఫోన్ నంబర్ 9440245771.












