సారంగాపూర్, 2026-06-05
సారంగాపూర్ మండలంలోని చించోలి గ్రామంలోని బి ఆర్ ఆర్ గార్డెన్ లో జరిగిన వివాహ వేడుకలో రోబో ఫోటోగ్రఫీ వినూత్నంగా అలరించింది. ముందుకు రండి.. ఫోటో తీసుకెళ్లండి అనే నినాదంతో ఆ రోబో ముందు నిలబడితే చాలు, మన చిత్రాన్ని క్షణాల్లో తీసి అందిస్తుంది.

ప్రత్యేక ఆకర్షణగా రోబో
కైరం కొండ ఉదయ్, శిరీష వివాహానికి కరీంనగర్ నుంచి నిర్వాహకులు ఈ రోబోను రూ.30 వేలు వెచ్చించి ప్రత్యేకంగా తెప్పించారు. దీంతో వివాహానికి వచ్చిన బంధుమిత్రులు రోబో ముందు నిలబడి తమ ఛాయాచిత్రాలను తీసుకుని ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఈ నూతన సాంకేతికత అందరినీ ఆకట్టుకుంది.